నాగార్జున సాగర్‌ నీటి విడుదల ఫ్లోరైడ్‌ బధిత ప్రాంతాలకే పరిమితం చేయలి

హైదరాబాద్‌: ఫ్టోరైడ్‌ బాధిత ప్రాంతాలు మినహా ఏ అవసరాలకూ నాగార్జున సాగర్‌ నీటిని విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నీటి విడుదలను హైదరాబాద్‌ నల్గొండ జిల్లాల్లోని ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాలకే పరిమితం చేయాలని ఆయన పిటిషన్‌లో అభ్యర్థించారు. నీటిమట్లం 510 అడుగులకు ఎక్కువగా ఉన్నప్పటికీ నీటిని విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు.