నాగిరెడ్డిపల్లి లో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు
భువనగిరి రూరల్ మార్చి 30 (జనం సాక్షి) యాదాద్రి భువనగిరి జిల్లా మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భాజా భజంత్రిలతో భక్తులు వెంటరాగా ఆలయ ధర్మకర్త రావి నరసింహారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జక్క కవిత రాఘవేందర్ రెడ్డి, రైతు సంఘం సభ్యులు చింతల శంకరయ్య, సాబన్కార్ వెంకటేష్, రావి కృష్ణారెడ్డి, వెంకట్ రెడ్డి,సురేష్ రెడ్డి,బలవంత రెడ్డి, గాదే శేఖర్, పిన్నింటి మల్లారెడ్డి, మధు, వార్డు మెంబర్ సురేష్, సురేందర్ గ్రామ ప్రజలుఅధిక సంఖ్యలో పాల్గఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా చేశారు పంతులు పవన్ శర్మ ఆధ్వర్యంలో జరిగాయి.