నాటక ప్రదర్శన కరపత్రాల ఆవిష్కరణనాటక ప్రదర్శన కరపత్రాల ఆవిష్కరణ
రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : ఈ నెల ఇరవై ఏడవ తేదీన మంచిర్యాలలో మహాత్మ జ్యోతిబా ఫూలే జీవితం పై నాటక ప్రదర్శన జరుగుతుందని వివిధ సామాజిక, న్యాయ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రామకృష్ణాపూర్ లో నాటక ప్రదర్శన కరపత్రాలను ఆవిష్కరించారు. మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో సోమవారం సాయంత్రం ఆరు గంటలకు సత్యశోధన నాటకంలో భాగంగా మహాత్మా ఫూలే, సావిత్రిబాయి ఫూలేలు సాగించిన సామాజిక, న్యాయ ఉద్యమాలు, వారి పోరాటాల గురించి వివరించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. 170 ఏళ్ల క్రితమే భారతీయులందరూ సమానులేనని.. అందరికీ సమాన అవకాశాలు దక్కాలనే సదాశయం కోసం ఒంటరి పోరాటం నడిపిన మహానుభావుడు ఫూలే జీవితం నుండి నేటి తరం నేర్చుకోవాల్సిన అంశాలన్నో ఉన్నాయని వారు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు ఈ నాటక ప్రదర్శనకు హాజరై మహాత్మా ఫూలే జీవితం పోరాటాలు అందించే సందేశాన్ని స్వీకరించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ పలిగిరి కనకరాజు, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కార్యదర్శి డూర్కె మోహన్, బీసీ ఐక్య వేదిక కన్వీనర్ కనుకుంట్ల మల్లయ్య, మోతె రామదాసు, సిఐటియూ నాయకులు గొమాస ప్రకాశ్, మారపల్లి రాజయ్య, జాడి రాజేశ్, జన విజ్ఞాన వేదిక నాయకులు అలుగురి కైలాసం, ప్రజాస్వామిక, సామాజిక, న్యాయ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.