నాటో జరిపిన వైమానిక దాడుల్లో 8 మంది మహిళలు దుర్మరణం

కాబూల్‌: అఫ్గనిస్థాన్‌లోని తూర్పుప్రాంతంలో నాటో జరిపిన వైమానిక దాడుల్లో ఎనిమిది మంది మహిళు దుర్మరణం చెందారు. దీంతో అగ్రహించిన ప్రజలు లఘ్మన్‌ ప్రాంత గవర్నర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సంఘటనపై పూర్తి విచారణ జరిప్తామని నాటో ప్రతినిధులు హామీ ఇవ్వడంతో ఆందోళన కారులు తమ నిరసనను విరమించారు.