నామినేటడ్‌ పదవుల్లో ముస్లింలకు ప్రాధాన్యమివ్వాలి : షబ్బీర్‌ అలీ

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నామినేటడ్‌  పదవుల్లో ముస్లింలకు ప్రాధాన్యమివ్వాలని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ విసృతిస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర మంత్రివర్గంలో ముస్లింసభ్యుడు ఒక్కరే  ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.