నామినేషన్ దాఖలుకు భారీ ర్యాలీతో బయలుదేరిన నీలం మధు

పటాన్ చెరు : మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ పురస్కరించుకొని పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గం గుమ్మడిదల టోల్ గేట్ నుంచి మెదక్ జిల్లా కేంద్రం వరకు పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీగా బయలుదేరింది. ఈ సందర్భంగా నామినేషన్ దాఖలుకు ఎంపీ అభ్యర్థి నీలం మధుతో బయలుదేరిన అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, పార్లమెంట్ ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ గుమ్మడిదలకు చేరుకున్నారు. గుమ్మడిదల టోల్ ప్లాజా సెంటర్ లో ఏర్పాటు చేసిన భారీ వాహనాల ర్యాలీని మంత్రి సురేఖ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.