నాయకుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే.
నెన్నెల, మార్చ్ 31, (జనంసాక్షి )
బీఆరెస్ సీనియర్ నాయకుడు గురునాదం మల్లగౌడ్ సతీమణి తనూజ ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆకుటుంబాన్ని పరామర్శించారు. ఆమె పెద్ద ఖర్మకు హాజరై నివాళులు అర్పించారు. మల్లగౌడ్ కు మనోధైర్యం అందించారు. ఆయన వెంట జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, సింగల్ విండో చైర్మన్ మేకల మల్లేష్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు గడ్డం అశోక్ గౌడ్, మండల కో అప్షన్ సభ్యుడు ఇబ్రహీం, నాయకులు గడ్డం భీమా గౌడ్, గణేష్ గౌడ్, సంతోషం ప్రతాప్ రెడ్డి, సింగతి రాంచందర్, సున్నం రాజు, సురేష్, మల్లేష్, గురునాదం ప్రేమ్ సాగర్ గౌడ్ ఉన్నారు.