నార్త్‌ కొరియాలో వింత ఆంక్షలు

` లిప్‌స్టిక్‌వాడకంపై నిషేధం
` మేకప్‌లపైనా అక్కడ ఆంక్షలు
ప్యోంగ్యాంగ్‌(జనంసాక్షి):ఉత్తర కొరియాలో కఠిన చట్టాలు అమలులో ఉన్నాయి. ఫ్యాషన్‌ అంశంలో కూడా వాటిని పాటిస్తున్నారు. కాస్మటిక్స్‌ యూజర్స్‌కు పెనాల్టీ విధిస్తున్నారు. ఎరుపు రంగు లిప్‌స్టిక్‌ పై ఉత్తర కొరియాలో తాజాగా నిషేధం విధించారు. నిజానికి ఎరుపు రంగుకు కమ్యూజినంతో లింకు ఉన్నా.. ఆ రంగు లిప్‌స్టిక్‌ను నార్త్‌ కొరియా బ్యాన్‌ చేయడం గమనార్హం. ఎక్కువగా మేకప్‌ వేసుకున్నవాళ్లను నార్త్‌ కొరియన్లు పట్టించుకోరు. మేకప్‌ వేసుకోవడాన్ని పశ్చిమ దేశాల సంస్కృతిగా ఉత్తర కొరియన్లు భావిస్తున్నారు. ఎరుపు రంగు లిప్‌స్టిక్‌ వేసుకున్నవాళ్లు ఎక్కువ అట్రాక్టివ్‌గా కనిపిస్తారని కొరియన్లు భావిస్తున్నారు. ఇది ప్రభుత్వ వైఖరికి విరుద్ధమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలు సాదాసీదాగా ఉండాలన్న ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకం అన్న విధానాన్ని పాటిస్తున్నారు. అందుకే అక్కడి చట్టాల ప్రకారం.. మహిళలు అతి తక్కువ స్థాయిలో మేకప్‌ ధరించాల్సి ఉంటుంది.రెడ్‌ లిప్‌స్టిక్‌ ఒక్కటే కాదు.. వ్యక్తిగతంగా అందంగా కనిపించాలన్న అంశాలపై ఉత్తర కొరియాలో అనేక ఆంక్షలు ఉన్నాయి. ఇటీవల కాలంలో కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సర్కారు అనేక కాస్మటిక్‌ వస్తువులను బ్యాన్‌ చేసింది. మహిళలు స్కిన్నీ, బ్లూ జీన్స్‌ వేసుకోరాదు. బాడీ పియర్సింగ్‌, హెయిర్‌స్టయిల్స్‌, ముల్లెట్స్‌, పొడుగైన కురులు ఉండరాదు. కేవలం సర్కారు అనుమతి ఇచ్చిన హెయిర్‌స్టయిల్స్‌లో మాత్రమే మహిళలు, పురుషులు కనిపించాల్సి ఉంటుంది. కొన్ని సిద్దాంతపరమైన ఆంక్షలు కూడా నార్త్‌ కొరియాలో ఉన్నాయి. బ్లాక్‌ ట్రెంచ్‌ కోట్లను ధరించరాదు. ఎందుకంటే కిమ్‌ వేసుకున్న స్టయిల్‌ డ్రెస్సులను మరొకరు వేసుకోరాదు. తనను ఎవరూ కాపీ కొట్టరాదన్న అభిప్రాయాన్ని కిమ్‌ వ్యక్తం చేశారు. ఫ్యాషన్‌ విషయంలో ఎవరు ఎలా ఉంటున్నారో పర్యవేక్షించేందుకు ప్రత్యేక పోలీసులు బృందాలు నిఘా పాటిస్తుంటాయి. ఒకవేళ ప్రజలు ఎవరైనా ఆ ఆంక్షలను ఉల్లంఘిస్తే, వాళ్లు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆడవాళ్లు బ్లూ జీన్స్‌ వేసుకుంటే వాళ్లకు శిక్ష తప్పదు. కొన్ని సందర్భాల్లో ్గªన్‌ వేస్తారు. కొన్ని సందర్భాల్లో వాళ్ల దుస్తుల్ని చింపేస్తారు. దీని వల్ల వాళ్లు మరోసారి ఆ డ్రెస్సు వేసుకోరన్న అభిప్రాయం ఉన్నది.