నాలుగేళ్ల చిన్నారికి డెంగీ

ఆలేరు: ఆలేరు పట్టణానికి చెందిన ఎండీ హమన్‌ అనే నాలుగేళ్ల బాలుడు డెంగీ వ్యాధికి గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్స నిమిత్తం అతన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీంతో పట్టణంలో గత పదిరోజుల నుంచి డెంగీతో బాధపడుతున్న వారి సంఖ్య ఇద్దరికి చేరింది.