నాలుగైదు రోజుల్లో వ్వవసాయ అవసరాలకు నీరు విడుదల చేస్తామని హామీ : సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్‌: కోర్టు నిబంధనల వల్లే కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయ లేకపోతున్నామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శనరెడ్డి తెలిపారు. ఎప్పుడూ లేనివిధంగా ఆగస్టు నెలలో నీటి సమస్య కూడా తలెత్తిందని ఆయన అన్నారు. ఈ ఏడాది ఆగస్టులో అతి తక్కువగా 27 టీఎంసీల నీరు వచ్చిందని వెల్లడించారు. శ్రీశైలానికి ఇప్పుడు ఎనిమిది టీఎంసీల నీరు వచ్చి చేరుతున్నందున తక్షణమే వాటిని తాగునీటి అవసరాలకు మళ్లిస్తామని తెలిపారు. తుంగభద్ర, ఆల్మట్టి డ్మాములు పూర్తిగా నిండి ఉన్నందున నాలుగైదు రోజుల్లో వ్వవసాయ అవసరాలకు నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.