నా అభ్యర్ధిత్వానికి మద్దతివ్వండి:ప్రణబ్‌

కోల్‌కతా:రాష్ట్రపతి ఎన్నికల బరిలో తనకు మద్దతివ్వాలని యూపీఏ అభ్యర్ధి ప్రణబ్‌ ముఖర్జీ మరోసారి అన్ని పార్టీలను కోరారు.తన అభ్యర్ధిత్వానికి మద్దతునిచ్చే విషయంలో ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోని పార్టీలను ఉద్దేశించి ఈ వినతిని చేసినట్లు చెబుతున్నా తృణమూల్‌ కాంగ్రెస్‌ లక్ష్యంగా తాజాగా విన్నపం చేసినట్లు తెలుస్తొంది.తృణమూల్‌ మద్దతుపై నమ్మకంతోనే ఉన్నామని ప్రదాని మన్మోహన్‌సింగ్‌ పేర్కొనడం పై తానేమీ వ్యాఖ్యానించబోనన్నారు. స్వామి వివేకానంద స్ధాపించిన బేలూరు మఠాన్ని ప్రణబ్‌ ఆదివారం సందర్శించారు. వివేకానంద జయంతి ఉత్సవాల ఏర్పాట్ల పై నిర్వహకులను అడిగి తెలుసుకున్నారు.