నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు.: చందనాఖాన్‌

హైదరాబాద్‌: పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిశుభ్రతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రాథమిక విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి చందనాఖాన్‌ వివరణ ఇచ్చారు. పాఠశౄల, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకునే బాధ్యత విద్యార్థులపై ఉందని మాత్రమే తాను అన్నట్లు వివరించారు. విద్యార్థులే వాటిని శుభ్రం చేయాలని తాను అనలేదన్నారు. తన వ్యాఖ్యల్ని కొందరు వక్రీకరించారని చెప్పారు. హైదరాబాద్‌ జుబ్లీహాల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆమె ఈ మేరకు వివరణ ఇచ్చారు.