నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది: ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌

హైదరాబాద్‌: బీసీలు, మైనారీటీలకు కూడా ఉప ప్రణాళిక అమలయ్యేలా చూడాలని సికింద్రాబాద్‌ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ, మైనార్టీలకు ఉప ప్రణాళిక అమలయ్యేలా ముఖ్యమంత్రి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలో నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు మంత్రి కన్నా మాట్లాడుతూ దేశ చరిత్రలో తొలిసారి కౌలు రైతులకు భద్రత కల్పించింది. మన ప్రభుత్వమే అని అన్నారు. కోటి మంది  రైతులకు పంటరుణాలు ఇప్పించామని చెప్పారు.