నిత్యానందకు బెయిల్‌

బెంగళూరు : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామీ నిత్యానందకు బెయిల్‌ మంజూరైంది. జర్నలిస్టులపై దాడి కేసులో లొంగిపోయిన నిత్యానందకు బెంగళూరు కోర్టు ఒక రోజు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. దీంతో ఆయన బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేసుకున్నారు. కస్టడీ ముగియడంతో నిత్యానందను గురువారం కోర్టులో హాజరుపర్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్‌ మంజూరైంది. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఆశ్రమం నుంచి పారిపోయి తప్పించుకు తిరుగుతూ బుధవారం తనకు తానుగా రాంనగర్‌ కోర్టులో లొంగిపోయిన విషయం తెలిసిందే.