నినాదాన్ని తండాల్లో బేటీ బచావో ప్రచారం చేయాలి: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ):  బేటీ బచావో, బేటీ పఢావో నినాదాన్ని తండాల్లో ప్రచారం చేయాలని తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. గిరిజన గ్రామాలకు చేరినప్పుడే బేటీ బచావో, బేటీ పఢావో నినాదానికి సార్థకత లభిస్తుందన్నారు. ఇక్కడ ఆడపిల్లల హత్యలు పురట్లోనే జరగడం దారుణమన్నారు. వీరిలో చైతన్యం తసీఉకుని రావాల్సి ఉందన్నారు. గోసంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు సేవాలాల్‌ కృషి చేశారని కిషన్‌రెడ్డి కొనియాడారు. కేంద్ర నిధులను జనాభా దామాషా మేరకు తండాల్లో ఖర్చు చేయాలన్న ఆయన లంబాడీ తండాలను గ్రామపంచాయతీలుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తండాల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేయాలన్నారు. లంబాడీ యువతలో చితన్యం తీసుకురావాలన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి తీమవంతుగా కృషి చేస్తామని అన్నారు. సేవాలాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.