నిమ్మగడ్డ రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌, ఐఏఎస్‌ అధికారి బ్రహ్మానందరెడ్డిల జ్యుడీషియల్‌ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈనెల 21 వరకు పొడిగించింది. నేటితో రిమాండ్‌ గడవు ముగియడంతో జైలు అధికారులు వీరిద్దరని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టులో హాజరు పర్చారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున రిమాండ్‌ పొడిగించాలని సీబీఐ మెమో దాఖలు చేసింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం సదరు నిందుతల రిమాండ్‌ను 21వ తేదీ వరకు పొడిగించింది.