నియోజకవర్గం వ్యాప్తంగా 2 కోట్ల 67 లక్షల రూపాయల విలువైన షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
ప్రతి పేదవాడి సంక్షేమమే లక్ష్యంగా పథకాలు
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు సెప్టెంబర్ 1 (జనం సాక్షి)
ఆడపిల్ల పెళ్లి నిరుపేద కుటుంబానికి భారం కాకూడదన్న సమున్నత లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రాపురం, జిన్నారం, బొల్లారం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 267 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పక్కల ద్వారా మంజురైన రెండు కోట్ల 67 లక్షల రూపాయల విలువైన చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆడపిల్ల పెళ్లి చేసేందుకు నిరుపేద ప్రజలు పడుతున్న కష్టాలను స్వయంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. పార్టీలకు అతీతంగా, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే అదృష్టంగా భావించే పరిస్థితులను ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టించారని అన్నారు. ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి, గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం, ఆడపిల్ల పుడితే కేసిఆర్ కిట్ తో పాటు 13 వేల రూపాయల ఆర్థిక సహాయం, కేజీ టు పీజీ ఉచిత విద్య అందించడంతోపాటు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ రంగాల్లోనూ మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్న ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని కోరారు.
పటాన్చెరు లో
పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన 120 మంది లబ్ధిదారులకు మంజూరైన కోటి 20 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, తాసిల్దార్ మహిపాల్ రెడ్డి, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ లో..
అమీన్పూర్ మండలం మున్సిపల్ పరిధిలోని వివిధ గ్రామాలు, కాలనీలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల ద్వారా మంజూరైన 22 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, ఎమ్మార్వో విజయ్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.