నిరాహార దీక్షలను విరమించిన పారిశ్రామిక వేత్తలు

హైదరాబాద్‌: విద్యుత్తుకోతలకు నిరసనగా వారం రోజులుగా హైదరాబాద్‌లో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలను చిన్న, మధ్యతరహా పారిశ్రామిక వేత్తలు విరమించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మరో రెండు రోజుల్లో చర్చలు ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చేనేత శాఖామంత్రి ప్రాసాద్‌ హామీ ఇవ్వటంతో దీక్షలను విరమిస్తున్నట్లు పారిశ్రామికవేత్తల ఐకాస నేతలు ప్రకటించారు.