నిరుపేద కుటుంబాలకు హెల్పింగ్ హ్యాండ్స్ రూ. 10,000 సాయం
జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన తాటికొండ శ్రీరాములు తీవ్ర అనారోగ్యంతో ఇటీవల మరణించగా వారి కుటుంబానికి హెల్పింగ్ హ్యాండ్స్ వారు రూ. 5,000/- అందించి వారి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. అలాగే మండల కేంద్రానికి చెందిన ఎండీ. షఫీ సన్ ఆఫ్ ఖాజా మోయినిద్ధిన్ అనారోగ్యం తో బాధపడుతుండగా వైద్య ఖర్చులకి హెల్పింగ్ హ్యాండ్స్ సాయంగా రూ 5,000/- అందించడం జరిగినది. ఇందుకు సహకరించిన హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులందరికీ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు నారగోని సతీష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్యాల విజయ్ , మల్యాల నరేష్, రెడ్డి చైతన్య, మెడగోని సాయి, ఎండీ సద్దాం, తాటికొండ లింగచారి, ఆవునూరి శ్యామ్, నారగోని ప్రశాంత్, చెన్నోజు చంద్రశేఖర్, అజయ్, బాబు ప్రసాద్ పాల్గొన్నారు.