నిలకడగా ఆడుతున్న భారత్‌

చెన్నై : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ నిలకడగా ఆడుతోంది. సచిన్‌ (81) 196 పరుగుల వద్ద లైయాన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మూడు వికెట్ల నష్టానికి 182 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీం ఇండియా ప్రస్తుతం 80 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. కోహ్లీ 84. ధోని 39 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీన్‌ 380 పరుగులకు ఆలౌట్‌ అయింది.

తాజావార్తలు