ముగిసిన ప్రచారం
` రేపే పోలింగ్
` పురపోరుకు సర్వం సిద్ధం
` 116 మున్సిపాలిటీలు ,7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు
` 11న మున్సిపల్ పరిధిలో సెలవు ప్రకటన
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది. చివరిరోజు ఉధతంగా ప్రచారం సాగింది. కాంగ్రెస్ నుంచి మంత్రులు తమ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. బిజెపి, బిఆరఎస్ నేతలు కూడా ప్రచారంలో దూసుకుపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు , 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. అధికార , ప్రతిపక్ష పార్టీలు తమ సత్తా నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలను సెవిÖ ఫైనల్స్‌గా భావిస్తున్నాయి. అగ్రనేతల పర్యటనలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారంతో ఇన్నాళ్లూ మార్మోగిన వీధులన్నీ ఇప్ప్పుడు నిశ్శబ్దంగా మారాయి. ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్‌లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఇప్ప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో ఓటర్ల బలం గణనీయంగా ఉంది. మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించు కోవడానికి మొత్తం 52,43,023 మంది ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 25,62,639 కాగా, 26,80,014 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం ఈ ఎన్నికల్లో కీలక పరిణామంగా కనిపిస్తోంది. వీరితో పాటు మరో 640 మంది ఇతర ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,195 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల కోసం 16,031 బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేశారు. పోలింగ్ పక్రియను పర్యవేక్షించేందుకు 1,379 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు (ఖీక్ష), 1,547 మంది సహాయ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. క్షేత్రస్థాయిలో 9,560 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు (ఖక్ష), 31,428 మంది ఇతర సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరచడానికి 137 స్టాంª`రగ్ రూమ్‌లు, ఫలితాల లెక్కింపు కోసం 136 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. సుమారు 25,000 మంది పోలీసు సిబ్బందితో రాష్ట్రవ్యాప్తంగా నిఘా పెంచారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. ఎన్నికల పక్రియలో పూర్తి పారదర్శకతను పాటించేందుకు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్ సదుపాయాన్ని కల్పించారు. దీని ద్వారా ఎన్నికల సంఘం అధికారులు నేరుగా పోలింగ్ సరళిని పర్యవేక్షించవచ్చు. మొత్తం 12,993 మంది అభ్యర్థులు తమ అదష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.ఫిబ్రవరి 11న పోలింగ్ ముగిసిన తర్వాత, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి 14న మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు మున్సిపల్ చైర్మన్ , డిప్యూటీ చైర్మన్ల ఎన్నిక పక్రియ జరుగుతుంది. చివరగా ఫిబ్రవరి 16న కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, ప్రత్యేక సమావేశంతో ఈ ఎన్నికల పక్రియ పూర్తి కానుంది.
11న మున్సిపల్ పరిధిలో సెలవు
ఈ నెల11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఎన్నికలు జరిగే కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో పనిచేసే ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు ఈ నెల 11న స్థానిక సెలవు దినంగా ప్రకటిస్తూ ఎన్నికల సంఘం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కోసం వినియోగిస్తున్న విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాలు, ఇతర పబ్లిక్ బిల్డింగ్స్ అన్నింటికీ 10, 11 న స్థానిక సెలవు దినంగా ప్రకటించారు. ఓట్ల లెక్కింపులో భాగంగా ఈ నెల 11 నుండి 13 వరకు సెలవులు ప్రకటిస్తూ జారీ చేశారు.


