నీతి అయోగ్‌లో మూడు ఉపసంఘాలు: జైట్లీ
న్యూఢిల్లీ : నీతి అయోగ్‌లో సీఎంలతో మూడు ఉపసంఘాలు ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. నీతి అయోగ్ సమావేశం ముగిసిన అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడారు. నీతి అయోగ్‌పై ముఖ్యమంత్రుల అభిప్రాయాలను ప్రధాని తీసుకున్నారని చెప్పారు. 66 కేంద్ర పథకాలను కొనసాగించాలని సీఎంలు అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు. ఏ పథకం నిధులు తగ్గించొద్దని ప్రధానిని సీఎంలు కోరారు అని తెలిపారు. రాష్ర్టాల సహకారంతోనే స్వచ్ఛభారత్, జన్‌ధన్ యోజన విజయవంతమైందన్నారు. 2015 బడ్జెట్‌పై నీతి అయోగ్ చర్చించిందని చెప్పారు.