నీలం తుపాను నష్టంపై ముఖ్యమంత్రి సమీఓ

హైదరాబాద్‌: నీలం తుపాను కారణంగా సంభవించిన నష్టంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇవాళ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై తుపాను నష్టంపై చర్చించారు. తుపాను కారణంగా 44 మంది మృతి చెందారని ఆయన వెల్లడించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్టు తెలియజేశారు. తుపాను బాధితులకు తక్షణ సాయంగా కుటుంబానికి 20 కిలోల బియ్యం, ఐదు లీటర్ల కిరోసిన్‌ అందజేశామని స్పష్టం చేశారు. తుపాను కారణంగా తడిచిన పత్తిని, ధాన్యాన్ని కొనుగొలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలియజేశారు. ఇసుక మేటమేసిన పొలాల బాధిత రైతులకు హెక్టారుకు రూ. 8,100 అదనంగా చెల్లించాలని ఆయన అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న చెరువు కట్టలను, రోడ్లను వెంటనే పునరుద్దరిచాలని ఆయన ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.