నూతన ఇసుక విధానాన్ని ప్రకటించనున్న ప్రభుత్వం

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక విధానాన్ని ఈ రోజు ప్రకటించనుంది. మంత్రి గల్లా అరుణకుమారి నూతన విధానం ద్వారా తీసుకున్న నిర్ణయాలను వెల్లడించనున్నారు. ఈ విధానంలో క్యూబిక్‌ మీటర్‌ ఇసుక రూ.325గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్లకు ఏ క్వారీ నుంచైనా ఇసుకను ఉచితంగా సరఫరా చేయమంది.