నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం..

 k8m5f9puహైదరాబాద్ : శాసనమండలికి ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. కౌన్సిల్ దర్బార్‌హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ నూతనంగా ఎన్నికైన అభ్యర్థుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు హరీష్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, చందూలాల్ తదితరులు హాజరైయ్యారు. టీఆర్‌ఎస్ తరపున కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, నేతి విద్యాసాగర్‌రావు, కే. యాదవరెడ్డి, బీ. వెంకటేశ్వర్లు ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీల వెంట పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు వచ్చారు. ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో కోలాహలం కనిపించింది.