నూతన కమిటీ ఎన్నిక బహుజన్ సమాజ్ పార్టీ పెగడపల్లి మండలం.
.నూతన కమిటీ ఎన్నిక బహుజన్ సమాజ్ పార్టీ పెగడపల్లి మండలం..మంగళవారం ఉదయం పెగడపల్లి మండల కేంద్రంలోని బహుజన్ సమాజ్ పార్టీ ఆఫీస్ నందు రాష్ట్ర కార్యదర్శి దొడ్డే సమ్మన్న మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ నక్క విజయకుమార్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగినది అని మీడియా కు ప్రకటన ద్వారా తెలిపారు పెగడపల్లి మండల అధ్యక్షుడు గా గొడుగు నరేష్, ఉపాధ్యక్షుడుగా దీకొండ అజయ్,జనరల్ సెక్రటరీగా లంక క్రాంతి కుమార్, కార్యదర్శిగా అరెల్లి రాకేష్, కోశాధికారిగా మల్యాల రవి, నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి రాష్ట్ర కార్యదర్శి దొడ్డె సమ్మన్న మాట్లాడుతూ, మీరంతా సైనికులు లా పనిచేయాలని బహుజన రాజ్యం వచ్చేంతవరకు వెనుతిరగద్దని, ఆయా పార్టీల వారు మీకు ఎరవేసి మీకేం కావాలో చెప్పండి అని ప్రలోభ పెట్టి బహుజన రాజ్యానికి అడ్డుపడతారని తెలియజేశారు. అదేవిధంగా ఒకవేళ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావాలి అనుకుంటే ఏ పార్టీలోనైనా ఆయనకు సంక్షిత స్థానం ఉండేది, కానీ ఈ బహుజనులకు రాజ్యాధికారం అనువార్యమని రాజ్యాధికారం ద్వారానే మన హక్కులను సాధించుకుంటామని విద్యా వైద్యం ఆర్థికం మెరుగుపడితే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ లందరూ కూడా ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న జనాల దగ్గర సంపద ఎందుకు లేదు అని గుర్తించి, ఆరున్నర సంవత్సరాల పదవి కాలాన్ని తునప్రాయముగా వదులుకొని రాష్ట్రంలో ఉన్న బహుజనులందరికీ న్యాయం జరగాలంటే బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే సాధ్యమైతుందని రావడం జరిగింది. కనుక ధర్మపురి నియోజకవర్గంలో ఉన్న బహుజనులంతా ఏకమై ఈసారి వచ్చే ఎలక్షన్లు సంపన్నులకు బుద్ధి చెప్పాలని ఏనుగు గుర్తుపై ఓటు వేయాలని కోరారు దానికి మీరందరూ కూడా నిరంతరము పనిచేయాలని సూచించారు. ఎన్నుకోబడ్డ వారందరూ కూడా రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులందరి మాటలను సూచనలను తీర్చుకుంటూ ముందుకు వెళతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ నక్క గంగాధర్, మహిళా అధ్యక్షురాలు ముంజ లీలా గౌడ్, నియోజకవర్గ కోశాధికారి దీకొండ రాజు జిల్లా ఈసీ మెంబర్ సిపల్లి బాబు, సీనియర్ నాయకులు కొత్తూరు శంకర్,లంక స్రవంతి తదితరులు పాల్గొన్నారు.