నూతన పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్

గరిడేపల్లి, సెప్టెంబర్ 1 (జనం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఆసరా పెన్షన్ కార్డులను కల్మలచెరువు గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ మూలగుండ్ల విజయ సీతారాంరెడ్డి చేతుల మీదుగా వృద్దులకు వితంతువులకు ఒంటరి మహిళలకు నూతన పెన్షన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ నట్టే విజయ్ కుమార్ ,గ్రామ పంచాయతీ కార్యదర్శి రేణుక ,వార్డ్ నెంబర్లు రమ్య,మౌనిక,రమణ,ప్రేమ్ కుమార్,రవీందర్ రెడ్డి,శ్రీదేవి పిఎసిఎస్ డైరెక్టర్ యోహాన్ , ఎక్స్ ఎంపీటీసీ సత్యనారాయణ రెడ్డి , నూతన పెన్షన్ లబ్దిదారులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు