నెక్లెస్‌ రోడ్డుకు ర్యాలీగా చేరుకోనున్న కార్యకర్తలు, నేతలు

హైదరాబాద్‌: తెలంగాణ కవాతుకు మధాహ్యం 12 గంటల నుంచి నెక్లెస్‌ రోడ్డుకు పలు సంఘాలు ర్యాలీగా చేరుకోనున్నారు. ఒంటిగంటకు 15 వేల మందితో జూబ్లీ బస్టాండ్‌ నుంచి నెక్లెస్‌ రోడ్డుకు తెరాస నేత హరీష్‌రావు నేతృత్వంలో 15 వేల మంది  కార్యకర్తలు చేరుకోనున్నారు.  తెలంగాణ భవన్‌ నుంచి కేటీఆర్‌ ఆధ్వర్యంలో, ఇందిరాపార్కు నుంచి సీపీఐ. భాజపా ఆధ్వర్యంలో, సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌ నుంచి  న్యూడెమోక్రసీ, తెలంగాణ జాగృతి కార్యకర్తలు ర్యాలీగా నెక్లెస్‌ రోడ్డుకు రానున్నారు. సికింద్రాబాద్‌ మింట్‌ కాంపౌడ్‌ నుంచి విద్యుత్‌ ఉద్యోగులు , మధ్యాహ్నం 12.30కు గన్‌పార్కు నుంచి తెలంగాణ జర్నలిస్టుల సంఘం నేతలు, 2 గంటలకు అక్కడి  నుంచి తెలంగాణ ఉద్యోగ సంఘాలు, పబ్లిక్‌ గార్డెన్‌ నుంచి తెలంగాణ ఉపాధ్యాయులు ర్యాలీగా నెక్లెస్‌ రోడ్డుకు వస్తున్నారు.