నెలాఖరులోగా ధ్రువపత్రాలతో హాజరుకావాలి

శ్రీకాకుళం, జూలై 8 :
రాజీవ్‌ యువశక్తి దరఖాస్తు దారులు ఆయా మండల, మున్సిపాలిటీ పరిధిలో నిర్దేశించిన ధ్రువపత్రాలతో నెలాఖరులోగా హాజరుకావా లని యువజన సర్వీసుల శాఖ సీఈఓ వీవీ ఆర్‌ఎస్‌ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత ఎంపీడీఓ, మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయంలో అభ్యర్థులు సంప్రదించాలని, దరఖాస్తులు కూడా ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలపారు. మండల, మున్సిపాలిటీలలో సం యుక్త ఎంపిక కార్యక్రమానికి ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు.18 నుంచి 38 సంవత్స రాల వయోశ్రేణిలోని 10వ తరగతి పాస్‌, పె ˜యిల్‌ అయినవారు, కుటుంబ వార్షిక ఆదా యం రూ.50వేలకు మించకుండా ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. పథకం ద్వారా లక్ష రూపాయలు విలువ చేసే సేవ, పరిశ్రమలకు సంబంధించిన యూనిట్లను స్థాపించవచ్చని, ఇందులో 50 శాతం రాయితీ ఇస్తారని తెలిపారు.