నేటితో ముగిసిన గ్రూప్‌-4 దరఖాస్తులు

హైదరాబాద్‌ : ఏసీసీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌-4 ధరఖాస్తుల గడువు గురువారంతో ముగియనుంది. జూన్‌ 30తో ముగిసిన ఈగడువును జులై 5 వరకు పొడిగిస్తూ ఏపిపీఎస్సీ గతంలో నిర్ణయం తీసుకుంది. మరికొంత మంది నిరుద్యోగులకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో దరఖాస్తు గడువును రెండుసార్లు పెంచామని ఇకపై ఈ అవకాశం ఉండదని ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు. ఇప్పటికే చాలన్‌ తీసుకున్న అభ్యర్థులు ఈరోజు అర్థరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. గ్రూప్‌-4లో భాగంగా నిర్వహిస్తున్న హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్ల ధరఖాస్తు గడువు సైతం నేటితో ముగియనుంది. ఇప్పటికే ఆరు లక్షలు దాటిన గ్రూప్‌-4 దరఖాస్తులకు అదనపు సమయం కల్పించడం వల్ల అభ్యర్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 1355 పోస్టుల భర్తీకి విడుదలైన గ్రూప్‌-4 నోటిఫికేషన్‌కు సంబందించిన రాత పరీక్ష ఆగస్టు 11న జరుగుతుంది.

తాజావార్తలు