నేటినుంచి ఐనవోలు మల్లన్న జాతర నేటినుంచి ఐనవోలు మల్లన్న జాతర 

 

 

 

 

 

 

భక్తుల కొంగు బంగారం ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు నేటి నుంచి జరగనున్నాయి. ధ్వజారోహణంతో జాతర ప్రారంభం కానున్నది. శుక్రవారం నుంచి ఉగాది వరకు జాతర జరగనుంది. ఐనవోలు మల్లన్నస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. స్వామి, అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. వరంగల్ నుంచి ఐనవోలు జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపుతుంది. జాతరకు 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 సీసీ కెమెరాల నిఘాలో నిరంతర పర్యవేక్షణ చేయనున్నారు.
ఆలయానికి దారులు ఇవే..ఆలయ భూమి చుట్టూ ‘కుడా’ ఆధ్వర్యంలో ప్రహరీ నిర్మించారు. ఆలయంలోకి ప్రవేశం ఒక తూర్పు వైపు నుంచి మాత్రమే ఉంటుంది. వరంగల్‌ నుంచి వచ్చే భక్తులు తహసీల్దార్‌ కార్యాలయం ముందు నుంచి బైపాస్‌ రోడ్డు ద్వారా ఐనవోలు పాఠశాల వెనుక భాగం వాహనాలు పార్కింగ్‌ చేసుకోవాలి. కాలి నడుక ద్వారా తూ ర్పు ముఖం నుంచి లోపలికి ప్రవేశించాలి. స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి వయా కూనూరు, గర్మిళ్లపల్లి నుంచి వచ్చే భక్తులు తాటి వనం దగ్గర వాహనాలను పార్కింగ్‌ చేయాలి. కాలి నడకన దేవాలయ తూర్పు వైపు నుంచి ఆలయంలోకి వెళ్లాలి. అదేవిధంగా హైదరాబాద్‌ పెద్దపెండ్యాల వయా వెంకటాపురం నుంచి వచ్చే భక్తులు వెంకటాపురం రోడ్డు ఒంటిమామిడిపల్లి రైస్‌ మిల్లు వద్ద వాహనాలు పార్కింగ్‌ చేయాలి.