నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు

ఖమ్మం, జూన్‌ 30: రెండు సంవత్సరాలుగా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులకు లైసెన్స్‌ కాలపరిమితి శనివారంతో ముగిసింది. జులై ఒకటి నుంచి ప్రారంభించాల్సిన దుకాణాలకు ప్రభుత్వం ఇటీవల లాటరీ ద్వారా దుకాణాలను ఏర్పాటు చేసింది. దీంతో కొత్తగా లాటరీ ద్వారా దుకాణాలు పొందిన వ్యాపారులు ఉత్సాహంతో ఉండగా ఇప్పటికే షాపులు నిర్వహిస్తున్న వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. జూన్‌ 28 వరకు సుమారు 33 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. జూన్‌ నెల 27, 28 తేదీల్లో మద్యం తీసుకెళ్లని వ్యాపారులకు మాత్రమే 29న రెండు లక్షల రూపాయల లోపు విలువైన సరకును విక్రయించినట్లు సిబ్బంది తెలిపారు.