నేటి నుంచి పశ్చిమబెంగాల్‌లో ప్రణబ్‌ పర్యటన

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నేటి నుంచి నాలుగు రోజులపాటు తన సొంత రాష్ట్రం పశ్చిమబెంగాల్‌లో పర్యటించనున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌ డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలు, హౌరాలో సాంజీబస్‌ ఆసుపత్రి ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రణబ్‌ తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. 17న రాష్ట్రపతి తిరిగి ఢిల్లీ బయలుదేరుతారు.