నేటి నుండి మూడో తేదీ వరకు వెల్జాల్ పులి లొంక శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు

మోమిన్ పేట మార్చి 1 జనం సాక్షివికారాబాద్ జిల్లా మోమిన్ పెట్ మండల పరిధిలోని వెల్చల్ గ్రామ పరిధిలోని పులిలొంక శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవం ఈనెల 1వ తేదీ నుండి మూడవ తేదీ వరకు శ్రీవారి జాతర మహోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని గ్రామ ప్రజలు తెలిపారు ఈనెల 1న ఉదయ o ధ్వజరోహణ o సాయంత్రం బోనాలు రాత్రి పల్లకి సేవ భజన కార్యక్రమాలు 2 న రాత్రి స్వామివారి రథోత్సవము తదుపరి భజన కార్యక్రమాలు2 న శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం అన్నదాన కార్యక్రమం పెరుగు వసంతం ప్రతిరోజు భజన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్య క్షేత్రం రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందినది ఎత్తైన కొండల్లో గృహ పచ్చని ప్రకృతి హలాదకరమైన వాతావరణం ఇచట గుండం ప్రత్యేకత ఒక సాధారణ మనసిచ్చే ఒక గొడ్డలిని పనిముట్టుగా వాడి గుట్టను గుహగా గుడిగా మలచిన మహనీయుడు పరమయ స్వామి అని చెప్పక తప్పదు అన్నారు 1960 సంవత్సరంలో వెలుగులోకి వచ్చి దినదినంగా అభివృద్ధి చెంది స్వామి వారు భక్తులకు దర్శనమిస్తున్నారు స్వామి వారికి నిత్య పూజలతో పాటు ప్రతి సంవత్సరం నిర్వహించు జాతర మహోత్సవం లో పాల్గొని తరించగలరు బస్ రూట్ వికారాబాద్ సదాశివపేట మధ్యలో హైదరాబాద్ కి 60 కిలోమీటర్ల దూరం వికారాబాద్ అనంతగిరి కి 15 కిలోమీటర్ల దూరంలో వెల్చల్ గ్రామం నుండి రెండు కిలోమీటర్లు దూరం రైట్ రూట్ వికారాబాద్ జహీరాబాద్ మధ్యలో సదాస్పెట్ రైల్వే స్టేషన్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో దేవాలయం కలదు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి జాతర మహోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ మరియు గ్రామస్తులు తెలిపారు