నేడు జడ్పీ సర్వసభ్యసమావేశం

నల్గొండ,ఏప్రిల్‌1: నల్లగొండ జిల్లాపరిషత్‌ సర్వసభ్యసమావేశం  2 తేదీన గురువారం  కలెక్టరేట్‌ సముదాయంలోని ఉదయాదిత్య భవనంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు  జిల్లాపరిషత్‌ సీఈవో మహేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే సవిూక్ష సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు కానుండటంతో వివిధ ప్రభుత్వశాఖల అధికారులు పూర్తి సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని ఆయన కోరారు. ఇందులో అనేక అంశాలపై చర్చిస్తారు. ప్రధానంగా తాగునీరు తదితర సమస్యలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.