నేడు జైలు నుంచి విడుదల కానున్న నూపుర్‌ తల్వార్‌

ఘజియాబాద్‌: ఆరుషీ హత్య కేసులో ఆమె తల్లి నూపుర్‌ తల్వార్‌ నేడు జైలు నుంచి విడుదల కానుంది. కూతురు ఆరుషి, హేమ్‌రాజ్‌ జంట హత్యల కేసులో భర్తతోపాటు నిందితురాలిగా ఉన్న నూపుర్‌కు సుప్రీంకోర్టు గతంలో బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఐదు నెలలుగా ఘజియాబాద్‌ దస్నా జైలులో ఉన్న ఆమె నేడు విడుదల కానుంది.