నేడు టీటీడీ పాలక మండలి ప్రమాణ స్వీకారం

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ రోజు రాత్రి జరగనుంది. మొత్తం 13 మంది సభ్యుల్లో అధ్యక్షుడు బాపిరాజు, ఎనిమిది మంది సభ్యులు తొలుత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మిగితా ఐదుగురు మరో మంచి ముహూర్తం రోజు ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి వీఐపీ విరామ దర్శనాన్ని రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. పాలకమండలి ప్రమాణ స్వీకారాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు నిర్ణయం తీసుకున్నారు.