నేడు టీబీజీకేఎస్‌ జనరల్‌బాడీ సమావేశం

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) :
భూపాలపల్లి ఏరియా టీబీజీకేఎస్‌ జనరల్‌బాడి సమావేశం నేడు స్థానిక కేటికే 5వ గని ఆవరణలొ జరగనున్నట్లు టీబీజీకేఎస్‌ బ్రాంచి ఉపాధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్‌ తెలిపారు. ఈ సమావేశం ఉద యం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నట్లు, ఈ సమావేశానికి టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షులు, చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, టీబీజీకేఎస్‌ అధ్యక్షులు కెంగర్ల మల్లయ్య, భూపాలపల్లి నియోజకవర్గ టీిఆర్‌ఎస్‌ ఇంచార్జి సిరికొండ మధుసూధనాచారి, ప్రముఖ గాయకుడు దేశపతి శ్రీనివాస్‌, కేంద్ర కమిటీి నాయకులు హజరుకానున్నారని పేర్కొన్నారు. కార్మిక సమస్యలపై సుధీర్ఘమైన చర్చ ఉంటుందని ఆ సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహాల గూర్చి ఇందులో చర్చించడం జరుగుతుందన్నారు. దీనికి టీబీజీకేఎస్‌ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయగలరని శ్రీనివాస్‌ కోరారు.