నేడు ‘టీ’ మంత్రులు భేటీ

హైదరాబాద్‌: ‘తెలంగాణ మార్చ్‌’పై చర్చించేందుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌ రెడ్డి నివాసంలో నేడు తెలంగాణ మంత్రులు భేటీ కానున్నారు. తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేయించేలా ప్రయత్నించాలంటూ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి చేసిన విజ్ఞప్తి పై ఈ సమావేశంలో మంత్రులు చర్చించనున్నారు. మరోవైపు కవాతుకు అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ ఐకాస కూడా  తెలంగాణ మంత్రులపై బాధ్యత పెట్టిన నేపథ్యంలో ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది, అటు తెలంగాణ, కాంగ్రెస్‌ ఎంపీలు కూడా ఈ రోజు సమావేశం కానున్నారు. తెలంగాణ కవాతుకు ఇప్పటికే మద్దతు ప్రకటించిన ఎంపీలు తాజా పరిణామాలపై చర్చించనున్నారు.