నేడు పాక్‌ సుప్రీంకోర్టుకు ప్రధాని అష్రాఫ్‌

ఇస్లామాబాద్‌: కోర్టు ధిక్కరణ కేసులో పాక్‌ ప్రధాని రజా పర్వేజ్‌ అష్రాఫ్‌ నేడు ఆ దేశ సుప్రీంకోర్టు ముందు హాజరుకానున్నారు. అధ్యక్షుడు జర్దారీ మనీలాండరింగ్‌  కేసుల పునర్విచారణ కోసం స్విస్‌ అధారిటీస్‌కు లేఖ రాయడంలో విఫలమైనందుకు సుప్రీ కోర్టు ప్రధానికి గత నెలలో కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 27న కోర్టు ఎదుట హైజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.