నేడు ఫార్మాటెక్నీిషియన్‌ ఉద్యోగాలకు పరీక్ష

శ్రీకాకుళం, జూన్‌ 16 (జనంసాక్షి) : పైడిభీమవరంలోని ఎకలాజిగ్‌, టెక్నాలాజి లిమిటెడ్‌ ఫార్మా కంపెనీలోని టెక్నిషియన్‌ ఉద్యోగులకు ఈ నెల 17న పరీక్ష నిర్వహించనున్నట్లు  జిల్లా ఉపాధి అధికారి సిహెచ్‌ సుబ్బిరెడ్డి శనివారం నాడు ఇక్కడ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 1993-95 మధ్య జన్మించి 2011-12 విద్యా సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులైన పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులని తెలిపారు.అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు.