నేడు రాంచీలో మూడో వన్డే

రాంచీ: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సీరీస్‌లో భాగంగా మూడో వన్డే నేడు రాంచీలో జరగనుంది. సొంతగడ్డపై టీం ఇండియా సారధి మహేంద్రసింగ్‌ ధోనీ తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. చెరో విజయంతో సమంగా ఉన్న ఇరు జట్లు సిరీస్‌పై పట్టు సాధించేందుకు ఈమ్యాచ్‌ కీలకం కానుంది.