నేడు వాయిదా పడిన ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌: వాయిదా పడిన ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌ను ఈరోజు నిర్వహించనున్నారు. తొలుత నిర్ణయించిన ప్రకారం బుధవారమే కౌన్సెలింగ్‌ ప్రారంభం కావాల్సింది. అయితే ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడనందున కౌన్సెలింగ్‌ నిలిచిపోయింది.దీంతో అధికారులు కౌన్సెలింగ్‌ను నేటికి వాయిదా వేశారు. ఇప్పటివరకు జరిగిన ప్రధానోపాధ్యాయుల కౌన్సెలింగ్‌లో సుమారు 270 మందికి స్థానచలనం కలిగినట్లు విద్యాశాఖ సంచాలక కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.