నేడు విద్యాసంస్థల బంద్‌

హైదరాబాద్‌: విజయమ్మ దీక్ష సందర్భంగా తెలంగాణ వాదుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ నేడు విద్యాసంస్థల బంద్‌కు తెలంగాణ విద్యార్థి ఐకాస పిలుపునిచ్చింది. వైకాపా దాడులను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయనున్నట్లు కోదండరాం ప్రకటించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ బస్‌ డిపో ఎదుట తెరాస కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. దీంతో బస్సులు నిలిచిపోయాయి.