నేడు హైదరాబాద్‌కు ఆజాద్‌ రాక

హైదరాబాద్‌: కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జి గులాం సబీ ఆజాద్‌ ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం 10.50 గంటలకు లేక్‌వ్యైగెస్ట్‌హౌజ్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. సాయంత్రం మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. సోమవారం జరిగే కాంగ్రెస్‌ పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరుకానున్నారు. అనంతరం నల్గొండ జిల్లా భూదాస్‌ పోచంపలింలో గాంథీ పీస్‌ ఫౌండేషన్‌ కార్యక్రమంలో పాల్గొంటారు.