నేడూ కొనసాగనున్న సార్వత్రిక సమ్మె
హైదరాబాద్: కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మె నేడు కూడా కొనసాగనుంది. అన్ని ప్రధాన కార్మిక, ఉద్యోగ సమాఖ్యలు చేపట్టిన సమ్మె కారణంగా బుధవారం జనజీవనం పూర్తిగా స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సభలు, నిరసన కార్యక్రమాలు చేపట్టిన ట్రేడ్ యూనియన్ల నేతలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. సార్వత్రిక సమ్మె రెండోరోజు ర్యాలీలు, ధర్నాలతో తమ సమస్యల పరిష్కారానికి గళమెత్తేందుకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. అవసరమైతే తమ డిమాండ్ల సాధనకై నిరవధిక సమ్మెక కూడా వెనకాడబోమని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.