నేడ మండల కేంద్రాల్లో ఎస్‌ఎఫ్‌ఐ నిరసనలు

అదిలాబాద్‌/విద్యాగనర్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లోనెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలోని అన్ని మండల కార్యాలయాలు, ఎంఈవో, ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేయనున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలల్లో, వసతిగృహాల్లో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతుంటే పరిష్కరించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. గుర్తింపు లేని పాఠశాలల రద్దు, శిథిలావస్థకు చేరిన పాఠశాలల భవనాలకు మరమ్మతులు చేపట్టాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సంఘం సభ్యులు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.