నేతన్న భీమా లో ప్రతి కార్మికులు చేరాలి.
సైకాలజిస్ట్ పున్నం చందర్.
రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 25. (జనంసాక్షి). రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నేతన్న భీమా పథకంలో ప్రతి కార్మికుడు చేరాలని సైకాలజిస్ట్ పున్నం చందర్ కోరారు. గురువారం సిరిసిల్ల పట్టణంలోని గణేష్ నగర్ లో మనోవికాస కేంద్రం ఆధ్వర్యంలో నేతన్న బీమాపై కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పున్నం చందర్ మాట్లాడుతూ నేతన్నల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందించడంతోపాటు త్రిఫ్ట్ పథకం ద్వారా ప్రయోజనాలు చేకూరేలా చూస్తోందని అన్నారు. ఇటీవల ప్రత్యేకంగా అందించిన నేతన్న బీమా పథకంలో ప్రతి కార్మికుడు చేరాలని సూచించారు, కార్యక్రమంలో కమ్యూనిటీ ఫెసిలిటీ జక్కని దేవదాస్ ఎల్లయ్య మైండికేట్ సెంటర్ సిబ్బంది బూర శ్రీమతి రాపల్లి లతా కొండ ఉమా వేముల అన్నపూర్ణ పలువురు కార్మికులు పాల్గొన్నారు.