నైజీరియాలో తీవ్రవాదుల దాడిలో ఇద్దరు భారతీయుల మృతి

ఆబూజా : నైజీరియాలో ఇస్లామిక్‌ తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారతీయులు మరణించారు. మరోకరు గాయడ్డారు. మైదుగురి పట్టణంలోని గమ్‌ అరబిక్‌ ప్యాక్టరీపై బుధవారం అనుమానిత బోకో హరమ్‌ ఇస్లామిక్‌ తీవ్రవాదులు దాడి చేశారని, కార్మికులపై కాల్పులు జరిపారని భద్రత అధికారి సాగీర్‌ మూసా చెప్పారు. ప్యాక్టరీలోని 450 డాలర్లు కూడా దోచుకెళ్లారని తెలిపారు. తీవ్రవాదుల కాల్పుల్లో శంకర్‌ సాహ, బకుల్‌ మండల్‌ అనే ఇద్దరు భారతీయుల మృతిచేందారని, గాయపడిన మరో భారతీయుడు భీరెష్‌యాదవ్‌ను అసుపత్రిలో చేర్పించారు.