నైన కాలువకు గండి

శ్రీకాకుళం, జూలై 22 : ఆమదాలవలస మండలం చెవ్వాకులపేట సమీపంలోని నైర ప్రధాన కాలువకు గండి పడింది. దీంతో గతంలో కూడా గండ్లు పడి వేలాది ఎకరాల్లో పంటలను కోల్పోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువకు గండ్లు పడే ప్రమాదముందని, వేసవిలో మరమ్మతులు చేపట్టాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి భారీగా సుమారు 120 అడుగుల వెడల్పు వరకు గండి పడిందని వారంతా వాపోతున్నారు. తక్షణం అధికారులు స్పందించి గండి పూడ్చకుంటే పంటలు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోతామని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఈఎస్‌సీ పి.సుధాకర్‌ మాట్లాడుతూ గండి పూడ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. కాలువకు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు అధికారులు పరిశీలనకు వెళ్లారని, త్వరితగతిన గండిన పూడ్చుతామని ఆయన తెలిపారు.